స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా….

  • స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా….

ఏపీ లిక్కర్ స్కామ్ లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తోన్న విషయాలు నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి*

*ఇప్పటికే స్కామ్ నగదుతో జగన్ సన్నిహితులు 1000కోట్లతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ నడిపించారనే విషయం బయటకు రాగా.. ఊహించని విధంగా బంగారం కూడా భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.*

*ఫేక్ మద్యం కంపెనీలు సృష్టించి ఆ కంపెనీ అధిపతులు భారీగా బంగారం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మొదట 400కిలోల బంగారం కొనుగోలు చేశారనుకున్నా..*

*అది వెయ్యి కిలోల వరకు ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. బంగారం వ్యాపారం అధికంగా జరిగే ముంబై మార్కెట్ , తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి 200కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది.*

*ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా మిగతాది ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. బంగారం కొనుగోలు చేసిన తర్వాత మద్యం కంపెనీల అధినేతలు … రాజ్ కేసిరెడ్డి బృందానికి పంపేవారని తెలుస్తోంది.*

*ఆ బంగారం విదేశాలకు పంపి , నగదుగా మార్చి దాన్ని రియల్ ఎస్టేట్ , సినిమా రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది.*

*ఎవరెవరు బంగారం కొనుగోలు చేసి, రాజ్ కేసిరెడ్డి బృందానికి పంపారు?*

*ఆ బంగారాన్ని విదేశాలకు ఎలా పంపారు?*

*ఇందుకోసం రాజ్ కేసిరెడ్డికి ఎవరెవరు తోడ్పాటు అందించారు?*

*అనే విషయాలపై సిట్ ప్రస్తుతం ఫోకస్ పెట్టింది.మరోవైపు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ..*

*నిందితుల విచారణకు అనుమతి కోరింది. అనుమతి రాగానే ఈ కేసులో నగదు లావాదేవీలు, బంగారం కొనుగోలు వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టబోతోంది.*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*