2022లో అగ్నివీర్ లో పోస్టింగ్..
ఆపరేషన్ సింధూర్ లో మరణం..!
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కు చెందిన జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు.
గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు ఆర్మీ నుంచి సమాచారం అందింది.
సరిహద్దులో చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్..
రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్‌కు పిలిపించారు.
ఈ తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో మురళీనాయక్ మరణించారు…


Be the first to comment