ఐక్యతతో ముందుకు సాగితేనే బలిజ జాతి అభివృద్ధి సాధ్యం

ఐక్యతతో ముందుకు సాగితేనే బలిజ జాతి అభివృద్ధి సాధ్యం

▪️ మహనీయుల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు విస్తృతం చేద్దాం

▪️ రోపా ఆధ్వర్యంలో బలిజ, కాపు మహనీయుల స్మృతి సభ

▪️ ముఖ్య అతిథులుగా శ్రీ వినుకోట నాగేశ్వర్ రావు గారు, శ్రీ వైవి భాస్కర బాబు గారు, శ్రీ కోనేటి చంద్రబాబు గారు, శ్రీ ఐ వెంకటేష్ గారు, శ్రీ ఎస్ రామ్ నాథ్ గారు, శ్రీ మర్రి రమేష్ బాబు గారు, శ్రీ మలిశెట్టి దివాకర్ రావు గారు, శ్రీ రామాంజినేయులు గారు, శ్రీ బిఎ శ్రీనివాస రావు గారు

ఐక్యతతో ముందుకు సాగితేనే బలిజ జాతి అభివృద్ధి సాధ్యమని, ఎక్కడ ఉన్నా మన సంఘీయుడిని ఆదరించి పరస్పర సహకారం అందించు కోవాలని సంఘ పెద్దలు శ్రీ వినుకోట నాగేశ్వర్ రావు గారు, శ్రీ వై వి భాస్కర బాబు గారు, రిటైర్డ్ ఎంవిఐ శ్రీ కోనేటి చంద్రబాబు గారు, రిటైర్డ్ ఎస్పీ శ్రీ ఐ వెంకటేష్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్ రామ్ నాథ్ గారు, డివిజనల్ ఇంజనీర్స్ శ్రీ మర్రి రమేష్ బాబు గారు, శ్రీ మలిశెట్టి దివాకర్ రావు గారు, కెడిసిసి జనరల్ మేనేజర్ శ్రీ రామాంజినేయులు గారు, రైటర్డ్ ఎంఆర్ఓ శ్రీ బిఎ శ్రీనివాస రావు గారు అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్ నందు రాయల అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రోపా కార్యాలయంలో బలిజ, కాపు మహనీయుల స్మృతి సభను రోపా అధ్యక్ష కార్యదర్శులు చింతలపల్లి రామ కృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అతిథులు మహనీయులు శ్రీ మిరియాల వెంకటరావు, శ్రీ వంగవీటి మోహన రంగా, శ్రీ కైకాల సత్యనారాయణ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరియాల వెంకటరావు, వంగవీటి మోహన రంగా, కైకాల సత్యనారాయణ కాపు, తెలగ,బలిజ, ఒంటరి, మున్నూరు కాపు జాతి ఔన్నత్యానికి ఎంతగానో పాటు పడ్డారని, వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని తెలిపారు. మహనీయులు చూపిన బాటలో నడుస్తూ మన జాతి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి కోసం కృషి చేస్తూ యావత్తు సమాజ శ్రేయస్సు కోసం పాటు పడలన్నారు. ఈ కార్యక్రమంలో రోపా మరియు బలిజ సంఘ ప్రతి నిధులు అంచ పెద్ద స్వామి, వడ్ల శ్రీకాంత్, ప్రొఫెసర్ డాక్టర్ గునేటి రంగనాయకులు, బుర్రా చంద్ర మోహన్, గన్నపురెడ్డి శ్రీనివాస రావు, గౌతమ్ కృష్ణ, జె శ్రీనివాసులు, తుళువ గోపాల్, మధు సూదన రావు, అమరం నరసింహ రెడ్డి, వి జగదీష్, ఆర్ గిరి బాబు, ఎం మురళీ మోహన్, కొణిదెల శ్రీనివాస్, జె సుబ్బయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*